Finch had been out-of-form right through the course of the season and any hopes of redeeming himself in the final went up in smoke after he was dismissed for just 13 runs.
#AaronFinch
#BBL
#BigBashLeague2019
#adelaiderenegades
#adelaidestars
#Skipper
#funnyrunout
#cricket
#teamindia

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ మైదానంలో సహనం కోల్పోయాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ రెనిగేడ్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన ఏమరుపాటు కారణంగా రనౌటయ్యాడు.
మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ జాక్సన్ వేసిన బంతిని క్రీజులో ఉన్న కామెరూన్ ఆడాడు. అయితే, ఆ బంతి నేరుగా బౌలర్ వద్దకు సమీపించడంతో వెంటనే దానిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో లేని పరుగుల కోసం ప్రయత్నించిన ఆరోన్ ఫించ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఫించ్ మైదానంలోనే సహనం కోల్పోయాడు.
దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుతూ స్టేడియం లోపల ఉన్న ఛైర్‌ను బ్యాటుతో కొట్టి వెళ్లిపోయాడు. దీంతో ఛైర్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఫిబ్రవరి 24 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, రెండు టీ20ల సిరీస్ ఆడనుంది.